శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సమస్యలను తీర్చడమే లక్ష్యంగా డివిజన్లో పర్యటిస్తున్నామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెం. 2, స్ట్రీట్ నెం. 3 లో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్, స్థానిక నాయకులతో కలిసి స్థానికంగా నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నందు సింగ్, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, సత్తార్, అర్జున్, సత్యనారాయణ, సదానంద్, ఇబ్రహీం, ముకేష్ సింగ్, విజయ్ సింగ్, గణేష్, ప్రకాష్, చరణ్ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.