శేరిలింగంప‌ల్లిని ఆరోగ్య‌వంతంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని AS రాజు నగర్ కాలనీ లో రూ.19 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవిడుపు పరికరాల‌ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ AS రాజు నగర్ కాలనీ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం , సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు ,పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగింద‌ని, అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేనీ చంద్రకాంత్ రావు, నర్సింహ రావు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here