వర్షాల దెబ్బకు వంగిన స్తంభాలు.. ప్రమాదం తప్పించిన చర్యలు..

  • గంగారం గ్రామంలో విద్యుత్ సమస్యలపై స్పందన
  • విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వర్షాల ప్రభావంతో గంగారం గ్రామంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు వంగిపోవడం, తీగలు దిగువకు వేలాడుతూ ప్రమాద సూచనగా మారడం గ్రామస్తుల్లో ఆందోళన కలిగించింది. గాలి, వాన పెరిగితే ఎప్పుడైనా అపాయం సంభవించే పరిస్థితి నెలకొంది. గ్రామ సమస్యను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వంగిన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ప్రతిష్ఠించారు. దెబ్బతిన్న విద్యుత్ తీగలను మార్చి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేశారు.

సహాయ ఇంజినీరు హుస్సేన్ ఆధ్వర్యంలో లైన్‌మెన్ రాజు, సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని సహకరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి శేఖర్ ముదిరాజ్ పనులను పరిశీలించారు. విద్యుత్ ప్రమాదాలకు దారి తీసే పరిస్థితుల‌ను తొలగించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖపై ఉంద‌ని జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here