ప్రైవేటు స్కూల్స్ దోపిడీని అరిక‌ట్టాలి: ఏఐఎస్ఎఫ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వసంతపంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వివిధ మండలాల‌లో వసంత పంచమి పేరుతో కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్లతో అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ డీఈఓ పూర్ణచందర్ రావుకి వినతిపత్రం ఇచ్చారు. వివిధ మండలాలలో ప్రయివేట్ కార్పొరేట్ పాఠశాలల‌లో విద్యా వ్యాపారం దిశగా 2025-26 విద్యాసంవత్సరం గడవకముందుకే, వసంత పంచమి పేరుతో 2026-2027 విద్యా సంవత్సరంకి గాను నో అడ్మిషన్ ఫీ, డిస్కౌంట్ల పేరుతో ముందస్తు అడ్మిషన్లు బహిరంగంగా ఇష్టాను సారంగా చేపడుతున్నారు. అడ్మిషన్‌ ఫీ, బుక్స్, డ్రెస్, టై, బెల్ట్ పేర్లతో లక్షలకు లక్షలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విద్య పేరుతో వ్యాపారం చేస్తూ, ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమలో ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్ జిల్లా సహా కార్యదర్శి కె.శివ, జే. ధర్మ తేజ, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పి.వినోద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ టీ. నితీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here