శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ పీజేఆర్ స్టేడియం సమీపంలో తెలంగాణ రక్షణ సేన (TRS) జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు షేక్ అస్లాం, విష్ణుచారి, మురుగేషన్, దయానంద్, లక్ష్మి, మాధవి, సందీప్, ప్రవీణ్, శ్రీనివాస్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.





