శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): యువనాయకుడు మిరియాల ప్రీతం జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. హనుమంతరావు (వీహెచ్), టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్. లక్ష్మణ్ యాదవ్, పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావుతో కలిసి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ మిరియాల ప్రీతం యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటున్నారని ప్రశంసించారు. డివిజన్ అభివృద్ధికి యువ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రీతం వంటి యువకులు మరింత ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. మిరియాల ప్రీతం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సోమదాస్, రవీందర్ రావు, మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






