స్వచ్ఛ గురుకుల్ లో అందరూ భాగస్వాములు కావాలి – ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాలలో సోమవారం స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.

స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సెప్టెంబర్ 11 వరకు నిర్వహించినున్న స్వచ్ఛ గురుకుల డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ 5 నుండి 11 వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమం లో అందరు భాగ స్వాములు కావాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా అయితే విద్యార్థులపై పర్యవేక్షణ కొనసాగుతుందో ఇకపై గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, నుంచి వారి ప్రవర్తన, చదువు తదితర విషయాలపై ప్రోగ్రెస్ సిద్ధం చేయాలని తెలిపారు. అయితే ప్రకృతి, పరిశుభ్రత, పర్యావరణం లోని పచ్చదనం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించడంతోపాటు వారి బాధ్యతల్ని గుర్తు చేసే విధంగా గురుకులాల్లో ఒక మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టిన అధికారులను అభినందించారు.

ఈ స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గురుకులాలను ప్రోత్సహించేందుకు నగదు బహుతులను ఇవ్వనున్నామని తెలిపారు. స్వచ్ఛ గురుకులం కార్యక్రమం పూర్తయిన రోజు లేదా మరుసటి రోజు జిల్లా కలెక్టర్‌ నామినేట్‌ చేసిన అధికారి సంబంధిత గురుకులాన్ని సందర్శించి, పరిసరాలను తనిఖీ చేసి మార్కులు ఇస్తారు. వాటి ఆధారంగానే జిల్లా, రాష్ట్రస్థాయి బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఓ ఎస్ డి చంద్రకాంత్ రెడ్డి, రీజనల్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ శారద, గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ శారద, గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ పాపారావు, వైస్ ప్రిన్సిపాల్ గణేష్, రాజశ్రీ, లెక్చరర్స్ రజిత, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ గారు, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ ఓబీసీ ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్ సీనియర్ నాయకులు అనిల్ , ప్రసాద్, రాము, నరేందర్, నరేష్ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here