నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్బచ్ఛ శేరిలింగంపల్లి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. మనిషి ఆరోగ్య సూత్రాలలో వ్యక్తిగత పరిశుభ్రత అని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. స్థానిక కాలనీ వాసులతో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వీరేశం గౌడ్, శ్రీకళ, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి కుమార్, శానిటైజేషన్ సూపర్ వైజర్ జలంధర్ రెడ్డి, ఎస్ ఆర్ పీ లు బాలరాజ్, భరత్ కాలనీ వాసులు పాల్గొన్నారు.