నమస్తే శేరిలింగంపల్లి: గుండెపోటుతో అకస్మాత్తుగా జరిగే మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో దేశంలో వినూత్నమైన లెవల్ 1 కార్డియాక్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభించారు. సీటీవీఎస్ సర్జన్ డైరెక్టర్ మెడికవర్ గ్రూప్ ఆఫ్ ఇండియా డాక్టర్ కృష్ణ ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ ఛైర్మన్ అండ్ ఎండీ మెడికవర్ గ్రూప్ డాక్టర్ అనిల్ కృష్ణ, మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం కార్డియాక్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో సంభవిస్తున్న అతి సహజ కారణాలలో ఒకటిగా కార్డియో వాస్క్యులర్ డిసీజ్ (సీవీడీ) నిలుస్తుందన్నారు. దాదాపు సగానికి పైగా సీవీడీ మరణాలు అకస్మాత్తుగానే జరుగుతుంటాయన్నారు. చాలా వరకూ హార్ట్ ఎటాక్స్‌ను ఔట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ (ఓహెచ్‌సీఏ)గా వ్యవహరిస్తుంటారని, తీవ్రమైన గుండె పోటు సంభవించిన పరిస్థితులలో తక్షణ వైద్య సహాయం అందించాల్సి ఉంటుందన్నారు. ఈ లెవల్ 1 కార్డియాక్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ లో 24 గంటలూ ప్రైమరీ పీసీఐ సదుపాయాలు ఉండటంతో పాటుగా ఇంపెల్లా, మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ (ఎంసీఎస్) ఉపకరణాలూ, 24 గంటలూ ఎంసీఎస్ బృందం అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. లెవల్ 1 కేంద్రాలతో గుండె విఫలమైన, లేదంటే రక్తపోటు పరంగా తీవ్ర హెచ్చుతగ్గులతో గుండెపోటు బారిన పడిన రోగుల అదృష్టాన్ని మార్చవచ్చన్నారు.