ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్ వద్ద బీజేపీ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన పరకాల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని నిరసన వ్యక్తం తెలియజేశారు.

ఆల్విన్ x రోడ్ వద్ద నిర‌స‌న తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, పార్టీ నాయ‌కులు

ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటనలకు బాధ్యులనే నెపంతో భాజాపా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. పరకాల శాసన సభ్యుడు, తెరాస నాయకుడు ధర్మారెడ్డి రామజన్మభూమి ట్రస్టు కార్యక్రమాలపై చేసిన ప్రకటనకు నిరసనగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న నెపంతో బీజెపి నాయకులను అరెస్టు చేయడం తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ జరిగిందని భావించాల్సి వస్తుంద‌ని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ చేసిన వాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్నాయ‌ని అన్నారు. మంత్రి అయి ఉండి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామజన్మభూమి ట్రస్టుకు చెందిన కార్యకర్తలమీద పోలీసులు లాఠీ చార్జి చేయడం, వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, అందులో బీజెపీ మహిళా నాయకులను కూడా జైలుకు పంపడం వెనుక కేటీఆర్, దయాకర్ రావుల ప్రోద్బ‌లం ఉంది అని అన్నారు.

వరంగల్ జిల్లా పోలీసులు శాంతి భద్రతలను రక్షించాల్సింది పోయి తెరాస‌ నాయకుల ఆదేశాలను పాటించడం, వారికి తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ‌ అని అన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం అంశంపై, నిర్మాణానికి నిధులు సేకరిస్తున్న విషయంపై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఇప్పటికైనా చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రామదండు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తుందని, తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు అయోధ్యలో రామాలయ నిర్మాణంపై చేస్తున్న ప్రకటనల పట్ల ముఖ్యమంత్రి స్పందించాలని బీజెపీ తరఫున‌ డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్, శ్రీశైలం యాదవ్, రవిగౌడ్, కోటేశ్వరావు, మనోహర్, వరప్రసాద్, శ్రీశైలం కుర్మా, ఆకుల మహేష్, పవన్ కుమార్, శివముదిరాజ్, రవి, నవీన్, లక్ష్మణ్, ప్రసాద్, మహేష్ బాబు, శ్యామ్ లాల్, ఆంజనేయులు, నాయుడు, కుమార్, విజయ్ కుమార్, చందు, పాపయ్య, శివ, అశోక్ కుమార్, నిరంజన్ చారి, హరినాథ్ యాదవ్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here