నమస్తే శేరిలింగంపల్లి: శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎన్ క్లేవ్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.3.60లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను మాదాపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ క్యాస్ట్రో రెడ్డి, ఎస్ఐ శ్రీధర్, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సురక్ష ఎన్ క్లేవ్ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అన్నారు. సీసీ కెమెరాలు నేర శోధన, నేరాల నివారణకు తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు నరేంద్ర బల్ల, సందీప్, కాలనీ అధ్యక్షుడు మాల్లారెడ్డి, సెక్రటరీ శ్రీశైలం, చౌదరీ, హుస్సేన్, నిఖిల్ రెడ్డి, దేవినేని రవి, నరేందర్ రెడ్డి, విరేశం, నర్సింలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






