సుమిత్రన‌గ‌ర్‌లో అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న బిజెపి నేత‌లు

మ‌హాల‌క్ష్మీ దేవిని ద‌ర్శించుకుంటున్న బిజెపి శేరిలింగంప‌ల్లి ఇన్చార్జీ గ‌జ్జ‌ల యోగానంద్‌, నామాల శ్రీనివాస్, ఉప్ప‌ల ఏకాంత్‌గౌడ్‌

వివేకానంద‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద‌న‌గ‌ర్ డివిజ‌న్ సుమిత్రాన‌గ‌ర్‌లోని శ్రీ దుర్గామాత ఆల‌యంలో శ్రీ దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం అమ్మ‌వారు శ్రీ మ‌హా ల‌క్ష్మీదేవి అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు. స్థానిక బిజెపి నాయ‌కులు నామాల శ్రీనివాస్, ఉప్ప‌ల ఏకాంత్‌గౌడ్‌ల ఆహ్వానం మేర‌కు ఆ పార్టీ శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇన్చార్జ్ గ‌జ్జ‌ల యోగానంద్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్య‌క్షుడు మాద‌వ‌రం భీమ్‌రావులు మ‌హాల‌క్ష్మీ దేవిని ద‌ర్శించుకున్నారు. ఆహ్వానితులు వారిని అమ్మ‌వారి శేష‌వ‌స్త్రాల‌తో ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు న‌ర్సింగ్‌రావు, రాష్ట్ర బిసి సెల్ నాయ‌కులు శ్రీనివాస్ గౌడ్‌, సీనియ‌ర్‌ నాయ‌కులు ప‌ద్మ‌య్య‌, వేణు త‌దిత‌రులు పాల్గొన్నారు.

గ‌జ్జ‌ల యోగానంద్‌, మాద‌వ‌రం భీమ్‌రావుల‌ను స‌న్మానిస్తున్న నామాల శ్రీనివాస్‌, ఉప్ప‌ల ఏకాంత్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here