శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి ఆశీస్సులతో శాస్త్రోక్తంగా శ్రీ షిర్డీ సాయినాథ, మార్ఖండేయ స్వామి, సంతాన నాగదేవత అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించగా ఇందులో మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ పాల్గొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ షిర్డీ సాయినాథ, మార్ఖండేయ, సంతాన నాగదేవత అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం మెదటి రోజులో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య రాగం కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, గోపూజ, వేద పఠనం, పుణ్యాఃవాచనం, పంచగవ్య ప్రాశనం, ఋత్విక్వరణం, దీక్షాధారణ, యాగాశాల ప్రవేశం, అఖండ దీపారాధన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, వాస్తు, యోగిని, నవగ్రహ, క్షేత్ర పాలక, సర్వతోభద్ర, మండప స్థాపన, ప్రధాన కలశ స్థాపన, హారతి, ప్రత్యేక పూజలను క్రమబద్ధంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






