ప్రతి బస్తీ, కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి: మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ‌లో రూ.48.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యత‌ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. రాబోయే కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ నిఖిల్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు మల్లేష్ , శ్రీకాంత్ రెడ్డి, ఉమేష్, శేఖర్, సింగ్, సుమన్, తుకారాం, మహేందర్, శ్రీకాంత్, నగేష్, అరవింద్, సహదేవ్, నానక్ రామ్ గూడ‌ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here