శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ కాలనీలో ఉన్న బొమ్మరిల్లు బాంకెట్ హాల్‌లో స్థానిక శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కోనేరు ప్రసాద్, శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం మాతృ శ్రీ నగర్ సభ్యులు అప్పారావు, శ్రీనాథ్, కిషోర్, వెంకన్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






