నమస్తే శేరిలింగంపల్లి: రాయదుర్గం ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ తిరుపతికి భారతీయ జనతా యువమోర్చా శేరిలింగంపల్లి కన్వీనర్ అమర్నాథ్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో బుధవారం ఇన్స్పెక్టర్ తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన అమర్నాథ్ యాదవ్ భగవద్గీతను అందజేసి అభినందనలు తెలియజేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో యువత పూర్తి సహకారం అందించాలని ఇన్స్పెక్టర్ సూచించారు. ఆ విషయంలో తమ సహకారంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో బిజేవైఎం బృందం ముందుంటుందని అమర్నాథ్ యాదవ్ హామీ ఇచ్చారు.