శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం లో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంను అంగరంగా వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆశిస్తున్నాను అని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






