ఘ‌నంగా శ్రీ పోచమ్మ తల్లి తొట్టెల మహోత్సవం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 4 (న‌మస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఎల్సిజి క్రికెట్ గ్రౌండ్ వ‌ద్ద ఉన్న‌ ఓల్డ్ లింగంపల్లి గ్రామం శ్రీ పోచమ్మ తల్లి యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి తొట్టెల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొని అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ పోచమ్మ తల్లి యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. యువత చక్కని మార్గంలో ప్రయాణిస్తూ చక్కగా ఎదిగి చెడు మార్గంలో ప్రయాణించకుండా సన్మార్గంలో ప్రయాణిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ దైవాన్ని ప్రార్థిస్తూ భక్తి భావంతో ముందుకు సాగాల‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఫ‌ల‌హారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పోతు రాజులు ప్ర‌ద‌ర్శించిన విన్యాసాలు ఆక‌ట్ట‌కున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో మేకల బాబు యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, అందెల జయరాం యాదవ్, భరత్, రఘు గౌడ్, కిట్టు ముదిరాజ్, కొయ్యాడ మనీష్ యాదవ్, గ్రామ పెద్దలు, యువజన నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here