పాలకుల విధానాలతో దివాళా తీస్తున్న రైతాంగం: గదాగోని రవి

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 4 (న‌మస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వాల విధానాలతో వాస్తవ సాగుదారులైన రైతులకు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పండిన పంటకు కనీస మద్దతు ధర రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయాన్ని వీడి కూలీలుగా కార్మికులుగా మారుతున్నారని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గదాగోని రవి అన్నారు. రైతుల వ్యవసాయ రక్షణకు బలమైన ఉద్యమాలే ఏకైక శరణ్యమని ఆ దిశలో రాజకీయాల కతీతంగా రైతాంగాన్ని ఐక్యపరచాలని పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు)గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా రైతాంగ ఉద్యమాలు ఓంకార్ పాత్ర అనే అంశంపై పార్టీ కార్యాలయం ముజఫర్ అహమ్మద్ నగర్ లో మియాపూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అధ్యక్షతన నిర్వ‌హించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన యం సి పీ ఐ (యు)రాష్ట్ర కార్యదర్శి గదాగోని రవి మాట్లాడుతూ అమరజీవి ఓంకార్ తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల విముక్తి కోసం త్యాగం చేశారని, దున్నేవాడికే భూమి కావాలని, వేల ఎకరాల భూములను పేదలకు దక్కేలా కృషి చేశారని అన్నారు. ఆయన త్యాగాలు, ఆదర్శాల స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను విధానాలను నిరసిస్తూ పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టాన్ని పోడు భూములకు అటవీ హక్కులను సాధించుకునేందుకు మార్కెట్ దోపిడిని నివారించేందుకు రాజకీయాలకతీతంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, వి తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర కళావతి, అంగడి పుష్ప, గ్రేటర్ నాయకురాలు దేవనూర్ లక్ష్మి, డివిజన్ నాయకులు వల్లేవు అనిత, దేవనూర్ నర్సింహా, జి శివాని, యం డి సుల్తానా బేగం, యం డి రజియా బేగం, తెలంగాణ అంబేద్కర్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here