నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ఆదర్శనగర్ రోడ్డు నంబర్-2లోని ఎస్పీ రెసిడెన్సిలో ఐదు రోజులపాటు వినాయకుడు అంగరంగవైభవంగా పూజలందుకున్నాడు. వినాయక ఉత్సహ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సోమవారం వినాయకుడి లడ్డును వేలం వేయగా..
చింతకింది మీనా మహెందర్ గౌడ్ దంపతులు 2 లక్షల 20 వేల 116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. వారికి వారి కుటుంబసభ్యులకు, వినాయక ఉత్సహ కమిటీ సభ్యులు ఎస్పి రెసిడెన్సి వాసులందరూ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి కరుణ కటాక్షములు వారిపై ఎల్లవేళలా ఉండాలనీ మనసారా విఘ్నేశుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. వేలంలో ప్రవీణ్, శ్రవణ్, కేశవ్, వేణు, నర్సింహా, బాలమని పాల్గొన్నారు.
