కైదమ్మ కుంట చెరువును సుందరశోభితవనంగా తీర్చిదిద్దుతాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణతో దశ దిశ మారుతుంద‌ని, చెరువును సుజల జలం తో అపురూప దృశ్యకావ్యంగా ఆవిష్కృతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామ‌ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీక‌రణ, పునరుద్ధరణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కైదమ్మ కుంట చెరువు దశ దిశ మారునని, వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో CSR ఐటీ సంస్థ ప్రతినిధి చైతన్య, నాయకులు అక్తర్, దాత్రి నాథ్ గౌడ్, గంగాధర్, సుదేశ్, శ్రీనివాస్, జయసూర్య, మల్లికార్జున్, సురేష్ ,వెంకటేష్ గౌడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here