నమస్తే శేరిలింగంపల్లి: కరోనా ఉదృతి నేపథ్యంలో శేరిలింగంపల్లిలోని ప్రభుత్వ దవఖానాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, కరోనా వైద్య సేవలను విస్తృతం చేయాలని కోరుతు బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి ఆద్వర్యంలో డీఎంఎచ్ఓ కార్యాలయ ఇన్చార్జీ శ్రీనివాస్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డిలు మాట్లాడుతూ గత కొంత కాలంగా శేరిలింగంపల్లిలోని ఏరియా హాస్పిటల్, పట్టణ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను, బస్తీ దవఖానాలను పరిశీలించడం జరిగిందని, ఎక్కడ ప్రజలకు సరైన సేవలు అందుతున్న పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే హైటెక్ నియోజకవర్గంలో ఆరోగ్య చికిత్సలు కరువయ్యాయి అని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిన కొనసాగుతున్న వేళ లక్షల మంది జనాభకు టెస్టులు మాత్రం వందల్లో చేస్తున్నారి అన్నారు. వాక్సిన్లు కూడా రోజుకి వందకు మించడంలేదు వాటిని కూడా వేలలో పెంచాలని అన్నారు.

శేరిలింగంపల్లిలో సుమారుగా 13 బస్తి దవాఖానాలు వున్నాయని, వాటిలో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని, ఇప్పటికైనా అన్ని బస్తి దవాఖానాలలో కరోనా పరీక్షలను వెంటనే మొదలుపెట్ట, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అని అన్నారు. అదేవిధంగా కరోనా వాక్సినేషన్ సెంటర్లు, ఐసోలేషన్ సెంటర్లు ఒకే చోట ఉండడం చేత పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారని, వీటిని వేరు వేరు చోట్ల నిర్వహించాలని కోరారు. అదే విధంగా ఈ కేంద్రాలలో తగిన వైద్య సిబ్బంది లేనందున ఈ కొరతను వెంటనే పూర్తి చేసి సరిపడా సిబ్బంది, తగిన సదుపాయాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ కేంద్రాలని గంట గంటకి శానిటైజ్ చెయ్యాలని అన్నారు. శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలలో కరోనా విస్తృతి వేగవంతం అవుతున్న నేపథ్యంలో అన్ని ఆసుపత్రులలో కరోనా టెస్టులు, చికిత్స, వాక్సిన్ల పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కొమురయ్య, బీజేపీ కార్పొరేటర్లు, జిల్లా కార్యవర్గం నాయకులు పాల్గొన్నారు.





