నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్‌లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుని సోమవారం ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ స్థానిక హై టెన్షన్ లైన్ రోడ్డు లోని వరద నీటి కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోకుల్ ప్లాట్స్ అభివృద్ధిలో భాగంగా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. మంచి నీరు, డ్రైనేజీ, రోడ్లు, విధి దీపాలు వంటి వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని, మెరుగైన రవాణా సౌకర్యాలు కలిపించడంపై దృష్టి సారించామన్నారు. సుఖవంతమైన ప్రయాణానికి మంది రోడ్లు, అదేవిధంగా వరద నీటి కాల్వ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ఉన్నతస్థాయి ప్రమాణాలతో పనులు చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సాంబశివరావు, గుమ్మడి శ్రీను, బ్రిక్ శ్రీను, పితాని శ్రీను, అప్పారావు, సాంబయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






