నమస్తే శేరిలింగంపల్లి: సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కొండకు ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి లభించింది. చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన రమేష్ ఇటీవల మేడ్చెల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వెళ్లిన విషయం విదితమే. కాగా గురువారం పోలీస్ శాఖ విడుదల చేసిన పదొన్నతుల ఉత్తర్వులలో రమేష్ కొండకు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌గా అవకాశం లభించింది. ఈ సందర్భంగా రమేష్ కొండ మాట్లాడుతూ తనకు పదోన్నతి లభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఏసీబీలో భాద్యతయుతంగా విధులు నిర్వహించి ఉన్నతాధికారులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని అన్నారు. కాగా రమేష్ కొండకు పదోన్నతి లభించడం పట్ట చందానగర్ పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.