శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ హుడా ఫేజ్-2 లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉరిటి వెంకట్రావు నివాసంలో శ్రీ శివ శక్తి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఇందులో SLN కంపెనీ అధినేత డి.సుబ్బారావు రూ.4.21 లక్షలకు గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. అలాగే మరో లడ్డూను డి.అభిరామ్ సాయి రూ.2.25 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా ఉరిటి వెంకట్రావు మాట్లాడుతూ గణనాథుని లడ్డూలను దక్కించుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.