సమిష్టి కృషితో సైబరాబాద్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం: సైబరాబాద్ సీపీ అవినాష్ మ‌హంతి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గణేష్ నవరాత్రుల చివరిరోజు నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మ‌హంతి, శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్‌లోని గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన చెరువులను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. సీపీ ముందుగా ముందుగా శంషాబాద్ జోన్ లోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాముని చెరువు, తొండుపల్లి చెరువును సందర్శించి డీసీపీ బి.రాజేష్,ఇతర అధికారులతో నిమజ్జన సరళిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం సీపీ మాదాపూర్ జోన్‌లోని రాయసముద్రం చెరువు (ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్ పరిధి), గంగారం చెరువు (చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి)ను సందర్శించారు. అక్కడే ఉన్న డీసీపీ డాక్టర్ వినీత్, డబ్ల్యూ అండ్ సీఎస్డబ్ల్యూ డీసీపీ స్రుజనా కర్నం, ఏడీసీపీ మాదాపూర్ జయరాం, ఇతరులుకు పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, పౌరులు, ఇతర సంబంధిత వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు.

అధికారుల‌ను అడిగి వివ‌రాల‌ను తెలుసుకుంటున్న సీపీ అవినాష్ మ‌హంతి

నిమజ్జన ప్రక్రియ ఎటువంటి అపశృతి లేకుండా సజావుగా కొనసాగుతోందని, ఇది సైబరాబాద్ పోలీస్ విభాగం, జీహెచ్ఎంసీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో, రవాణా, నీటి పారుదల, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలు, ఇతర సంబంధిత విభాగాల సమిష్టి కృషి ఫలితమని ఆయన పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు, ఇతర సంబంధిత విభాగాలు కలిసి సమన్వయంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులు, వాలంటీర్లకు అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here