నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలో ప్రజలకు అవసరమయ్యే అన్ని మౌలిక వసతుల కల్పనకు పాటుపడుతున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ లో ఆదివారం కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా చేపట్టాల్సిన బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్క్ అభివృద్ధి తదితర సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నవీన్, సి.వి.రామన్ రావు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
