ఓల్డ్ ఏజ్ హోమ్ లో షఫీక్ రెహమాన్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌ప‌ల్లి కేపీహెచ్‌బీ కాలనీ సర్దార్ పటేల్ నగర్ లో ఉన్న గ్రేస్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ బాషా రెండవ కుమారుడు షఫిక్ రెహమాన్ జన్మదిన వేడుకల‌ను ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్బంగా గీతాంజలి మోడల్ హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులకు షఫిక్ రెహమాన్ స్వీట్లు పంచిపెట్టి, ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వృద్ధుల న‌డుమ కేక్ ను కట్ చేసి, 180 మంది వృద్దులకు భోజనాలు వడ్డించారు. స్వీట్లు, పండ్ల‌ను పంపిణీ చేశారు. గ్రేస్ ఓల్డ్ ఏజ్ హోమ్ శ్రీనివాస్ వృద్ధుల తర‌పున బాలుడికి సుఖ సంతోషాలతో జీవించాలని రానున్న రోజుల్లో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాషా కుమారుడు షారీఖ్ ఇక్బాల్, కుమార్తె మెహ్రూఖ్, విలేకరులు క్రాంతికుమార్, నర్సింహా, హేమంత్ సాగర్, శ్యామ్ సుందర్ , బాల కృష్ణ, సద్దాం హుస్సేన్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here