విఘ్నేశ్వరుడు అందరి జీవితాలలో సుఖశాంతులు నింపాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాలలో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నాన‌ని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని FCI కాలనీ, గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమలలో FCI కాలనీ వాసులు, గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి చల్లని దీవెనలు మియాపూర్ డివిజన్ ప్రజలందరిపై ఉండాలని ఆ విఘ్నేశ్వరున్ని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో FCI కాలనీ వాసులు సుప్రజా, JM శివ శంకర్, విజయ్ కుమార్, రాకేష్ సింగ్, జి బాబు రావు, శశికాంత్, ప్రణవ్ సాయి, రాజశేఖర్, సాయికాంత్, గణేష్, గ్రీన్ పి అపార్ట్మెంట్స్ వాసులు, కిరణ్, అరుణ్, సురేష్, రాజశేఖర్, ఫణి, నరేష్, మధు, వీరేంద్ర, మణి, చంద్రశేఖర్, రామంజున్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here