శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ CMC కాలనీలో బెరయా ప్రార్థన మందిరంలో పాస్టర్ జర్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్మస్ వేడుకలలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పాస్టర్ల తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి చర్చిల వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలని , అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి వాతావరణంలో పండుగ నిర్వహించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ యాదవ్, చాంద్ పాషా, కార్తిక్, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.






