మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. మంగళవారం సందర్శకులు శిల్పారామంలో సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరుల ఆటపాటలు, పిట్టలదొరల చమత్కారాలు చూసి సందర్శకులు ఉత్సాహంగా గడిపారు.