శేరిలింగంపల్లి, జనవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, బుడబుక్కల, జంగమదేవరుల , ఎరుకలసాని, పిట్టలదొర మొదలైన వారి జానపద కళారూపాలు శిల్పారామంలో కొలువుతీరాయి. సందర్శకులు కళారూపాలను ఆదరిస్తున్నారు. సెల్ఫీ లు , ఫోటోలు , వీడియోలు తీసుకున్నారు. భోగి పండుగను పురస్కరించుకొని పిల్లలందరికీ భోగిపళ్ల ఉత్సవం నిర్వహించారు. తాడేపల్లి సుబ్బలక్ష్మి బృందం సంక్రాంతి పాటలు అలరించాయి, రేణుక ప్రభాకర్ శిష్య బృందం గోదా కళ్యాణం , వాసుదేవ రావు బృందం పాతాళ భైరవి సురభి నాటకం ఎంతగానో ఆకట్టుకుంది.






