చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): సంకష్టహర చతుర్థి సందర్బంగా సోమవారం చందానగర్‌లోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి పంచామృతాభిషేకం, అర్చన, శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం శ్రీ సిద్ది బుద్ది సమేత శ్రీ వర సిద్ది వినాయక స్వామి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.







