రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి సామ‌ల కార్తీక్ శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాజ్య‌స‌భ ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డికి ప‌లువురు నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడుగా మెలుగుతున్న ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండ‌గా ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన అభినంద‌న స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం సీనియ‌ర్ నాయ‌కుడు అనిల్ కుమార్ యాద‌వ్‌తో క‌లిసి టీపీసీసీ కార్య‌ద‌ర్శి సామ‌ల కార్తీక్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కార్తీక్ మాట్లాడుతూ ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి పాల‌న గ‌తంలో వైఎస్ పాల‌న మాదిరిగా ఉంద‌ని కొనియాడారు. న‌గ‌రంలో ప్ర‌జ‌ల కోసం అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here