ద్విచ‌క్ర వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్‌ను ధ‌రించాలి: ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ద్విచ‌క్ర వాహ‌న‌దారులు హెల్మెట్‌ను ధ‌రించడం వ‌ల్ల ప్రాణాల‌ను సుర‌క్షితంగా నిలుపుకోవ‌చ్చ‌ని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌శాంత్ సూచించారు. సైబ‌రాబాద్ పోలీస్ కమిష‌నర్ ఆదేశాల మేర‌కు మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప‌లు ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా మోటార్ సైకిళ్ల‌ను న‌డిపిస్తున్న వాహ‌న‌దారుల‌పై ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మొత్తం 151 మందిపై కేసులు న‌మోదు చేశారు. ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ మాట్లాడుతూ వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని, హెల్మెట్ లేక‌పోతే ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు త‌ల‌కు తీవ్ర గాయ‌మైతే ప్రాణాలు పోయే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉంటాయ‌న్నారు. అలాగే వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌న్నారు. అనంత‌రం హెల్మెట్‌ల‌ను స‌రైన రీతిలో ఎలా ధ‌రించాలో వారు వాహ‌న‌దారుల‌కు వివ‌రించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here