నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి సీనియర్ నేత సదానంద్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి రాష్ట్ర నేత రవి కుమార్ యాదవ్, పలువురు బిజెపి నేతలు, కార్యకర్తల సమక్షంలో సదానంద్ యాదవ్ జన్మదిన కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా సదానంద్ యాదవ్‌ను రవి కుమార్ యాదవ్ శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ సదానంద్ యాదవ్ సొంత ఖర్చులతో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో దాదాపు రూ. 25 లక్షలతో ఆయన తల్లిదండ్రుల పేరిట పక్కా భవనాలను నిర్మించి నిరుపేద విద్యార్థులకు బాసటగా నిలిచారని అన్నారు. కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు సహాయంగా సేవలందించిన సదానంద్ యాదవ్ ను అభినందిస్తూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల ఎల్లేష్, రాధా కృష్ణ యాదవ్, అరుణ్ యాదవ్, గోపి యాదవ్, ఆదిత్య, కిట్టు తదితరులు పాల్గొన్నారు.