శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందానగర్‌లో ఉన్న కార్నర్‌స్టోన్ స్కూల్లో విద్యార్థులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఇందులో సుమారుగా 300 మంది విద్యార్థులు, 65 మంది స్కూల్ బస్ డ్రైవర్లు, 0 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో పాల్గొన్న వారందరికీ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించే ప్రాముఖ్యతను వివరించారు. రహదారి దాటే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, స్కూల్ బస్సుల్లో ఎక్కే, దిగే సమయంలో పాటించాల్సిన నియమాలు, రోజువారీ జీవితంలో ట్రాఫిక్ నియమాలను పాటించడం వంటి అంశాలను తెలియజేశారు. విద్యార్థులు ఈ ట్రాఫిక్ నియమాలను వారి తల్లిదండ్రులు కూడా కచ్చితంగా పాటించేలా చూడాలని సూచించారు. విద్యార్థులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై తమ తల్లిదండ్రులకు లేఖలు రాయాలని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో మియాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ ఆది మూర్తి, RC పురం ట్రాఫిక్ PS ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్. విద్యా సాగర్ రెడ్డి, చందానగర్ PS ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయ్, కార్నర్‌స్టోన్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






