శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి పరిధిలోని రాజీవ్ గృహకల్పలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వవిప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉపకమిషనర్ తేజావత్ వెంకన్నలు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంతనంరం రాజీవ్ గృహకల్ప వాసులకు పట్టణ ప్రగతి కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. అదేవిధంగా ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఏఎంఓహెచ్ రవి, డీఈ విశాలక్ష్మీ, ఈఎస్ అశ్విని స్థానిక ప్రజలకు దోమల నివారణ, వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించడానికి తీసుకోవాలిసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, పాపిరెడ్డి కాలనీ అధ్యక్షులు కొండల్ రెడ్డి, సందయ్య కాలనీ అధ్యక్షులు బస్వరాజు, గోపినగర్ కాలనీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, రాజీవ్ గృహ కల్ప సీనియర్ నాయకులు బసవయ్య, భాస్కర్, రవి రాథోడ్, విక్రమ్ యాదవ్, నవీన్ రెడ్డి, రాంరెడ్డి, అష్రాఫ్, నర్సింహా, పట్లోళ్ల నర్సింహారెడ్డి, జమ్మయ్య, రాజు, గణపురం రవీందర్, శశికళ, చంద్రకళ, రోజా, భాగ్యలక్ష్మి, సభియా, సుధారాణి, కల్యాణి, కుమారి, నాజియా, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.