శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్, శేరిలింగంపల్లి డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ సరిగా లేక, అక్రమ కట్టడాల వలన ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు రోడ్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, కొన్ని డివిజన్ల రోడ్లు చాలా వరకు పాడైపోయాయని అలాంటి కాలనీలలో రోడ్లు వేయాలని, రోడ్లపై, ఖాళీ స్థలాలలో అక్రమంగా పుట్టుకొస్తున్న వ్యాపార సముదాయాలను అరికట్టాలని, అలాగే అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలు కట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జోనల్ కమిషనర్ స్పందిస్తూ తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, రాజేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.