శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): చదువుల్లో రాణిస్తున్నప్పటికీ పేదరికం కారణంగా ఇబ్బందులు పడుతున్న ఓ విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూతను అందించింది. విద్యలో రాణిస్తున్న 7వ తరగతి విద్యార్థి సాయికృష్ణకి లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ సహాయం అందించారు. సాయకృష్ణ ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతుండడంతో అతని ఫీజులకు అవసరం అయిన రూ.20వేలను ఆర్థిక సహాయంగా కొండా విజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బసి రెడ్డి మధుసూదన్ రెడ్డి, ట్రెజరర్ ప్రవీణ్ రెడ్డి, బర్ల మల్లేష్ యాదవ్, గుర్రం భాస్కర్, రవీందర్, విష్ణు, భగవాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.