శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, గోపనపల్లి తండాకు చెందిన సీనియర్ నాయకులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే డివిజన్ లో పర్యటిస్తానని, డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు నరేందర్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సంజీవ , డివిజన్ ఉపాధ్యక్షుడు దయాకర్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్ నాయకులు నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, యాదయ్య, ఆంజనేయులు, శ్రీశైలం, ప్రకాశ్ నాయక్, వేణు ప్రవీణ్ గౌడ్, దుర్గా రామ్, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.