శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో పెండింగ్ పనులను వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కోరారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని కోరారు. డివిజన్ పరిధిలోని సత్య ఎన్ క్లేవ్, కేఎస్సార్ ఎన్ క్లేవ్, శివాజీ నగర్ కాలనీలలో వరద నీరు చేరుతుందని దాని వలన కాలనీ వాసులు, వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారని కాలనీలలో వరద నీరు నిలవకుండా ప్రత్యేక వరద నీటి కాలువలను ఏర్పాటు చేయాలన్నారు. చందానగర్ శ్రీదేవి థియేటర్ అమీన్ పూర్ రోడ్డు పనులను వేంటనే చేపట్టాలన్నారు.