ఆశ వర్కర్ల సమస్యల‌ను పరిష్కరించాలని విన‌తి

శేరిలింగంపల్లి, మే 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని ఆశ వర్కర్ల సమస్యల‌ను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి PHC మెడికల్ ఆఫీసర్ కి మెమొరాండం స‌మ‌ర్పించారు. శేరిలింగంపల్లి సిఐటియు కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ ఏప్రిల్, మే నెల పారితోషికం వెంటనే ఇవ్వాలని, ప్రతినెల పారితోషికాన్ని 5వ తేదీ వరకు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు నీరజ, వనజ, ధర్మజా, హేమలత, సుజాత, ఎండి సల్మా, మంజుల, నాగలక్ష్మి, భారతి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here