శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కి బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులడు బేరి రామచంద్ర యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంజన్ కుమార్ యాదవ్ ను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ అంజన్ కుమార్ యాదవ్ ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మరింత సహాయ సహకారం అందించాలని కోరారు. పేద బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించాలన్నారు.






