రెడ్డిల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని విన‌తి

హైద‌రాబాద్‌ ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్రంలో ఉన్న రెడ్డిల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని, ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాల‌ని కోరుతూ ఏఐఆర్ఏ ప్ర‌తినిధులు శుక్ర‌వారం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఎంపీ, టీపీసీసీ అధ్య‌క్షుడు ఎన్‌.ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల‌కు విన‌తిపత్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏఐఆర్ఏ జాతీయ అధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, కోశాధికారి కాంరెడ్డి రాము, జాతీయ ఉపాధ్యాక్షురాలు కాంరెడ్డి కిరణ్మయి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడురు గోవర్ధన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎమ్.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఈడ‌బ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమ‌లు, రెడ్డి కార్పొరేషన్ ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేలా చూస్తామ‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు.

ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కి వినతిప‌త్రం అంద‌జేస్తున్న నల్ల సంజీవ రెడ్డి, ఏఐఆర్ఏ ప్ర‌తినిధులు
ఎంపీ, టీపీసీసీ అధ్య‌క్షుడు ఎన్‌.ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి వినతిప‌త్రం అంద‌జేస్తున్న నల్ల సంజీవ రెడ్డి, ఏఐఆర్ఏ ప్ర‌తినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here