- డీసీ ప్రశాంతికి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వినతి
ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ లో అభివృద్ధి పనులకు అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శుక్రవారం కూకట్పల్లి డీసీ ప్రశాంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్లో వరద ముంపు ప్రాంతాల వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ డివిజన్ లో బస్తీలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయని బస్తీలలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేష్ చంద్ర పాల్గొన్నారు.






