మియాపూర్/హఫీజ్‌పేట/శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ లో రూ 3 కోట్ల 68 లక్షల 6 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ రూప దేవి, ఏఈ రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్, ప్రేమ్, శర్మ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు గంగాధర్, అన్వర్ షరీఫ్, మోహన్ ముదిరాజ్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, గోపాల్ రావు, దాసరి గోపి కృష్ణ, విద్య సాగర్, బాబ్జి, శ్రీనివాస రావు, మహేందర్ ముదిరాజ్, జహంగీర్, రాజు, మల్లేష్, ప్రతాప్ రెడ్డి, కిషోర్, ప్రేమ్ కుమార్, దయానంద్, గురువయ్య, స్వామి నాయక్, హనుమంత్, రాజు, వంశీ, ఖాజా, చంద్రిక ప్రసాద్ గౌడ్, వరలక్ష్మి, రోజా సుప్రజ పాల్గొన్నారు.

హఫీజ్‌పేటలో…
హఫీజ్‌పేట డివిజన్ పరిధిలో రూ 3 కోట్ల 10 లక్షల 80 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ సురేష్, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు వాలా హరీష్, లక్ష్మా రెడ్డి, ప్రవీణ్, సుధాకర్, శాంతయ్య, బంగారు బాబు, రామ్మోహన్ రావు, సురేష్, సబీర్, తాహిర్, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

శేరిలింగంపల్లిలో…
శేరిలింగంపల్లి డివిజన్ లో రూ 1 కోటి 27 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎం నారాయణ, మేనేజర్ వెంకట్ రెడ్డి, డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకులు పద్మారావు, చింత కింది రవి, యాదగౌడ్, కృష్ణ యాదవ్, లింగం శ్రీను, కేఎన్ రాములు, స్థానికులు పాల్గొన్నారు.






