శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): దేశభక్తి, ఐక్యతకు ప్రతీకగా మియాపూర్‌లో మెయిన్ రోడ్ హేమ దుర్గా టెంపుల్ దగ్గర అదేవిధంగా రాఘవేంద్ర హోటల్ సమీపంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్, గిరి, గౌస్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, అశోక్ గౌడ్, విజయ్, మన్నెపల్లి నరేందర్, ప్రభాకర్, శంకర్, సుబ్బ రాయుడు, గోపినాథ్, వేణు, వీరభద్ర రావు, రాజు, నవీన్, గురువులు, వాసు, ప్రసాద్, నాని, రత్నాచారి, వంశీ, ప్రవీణ్, రాజేశ్, వినోద్, వినయ్, నాగ సాయి, రమేష్, గోపీ, వివేక్, సాయి, గోపాల్, సుభాష్ పాల్గొన్నారు.





