శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు అలుగు నుండి గంగారం చెరువు వరకు నాలా విస్తరణ పనులలో భాగంగా రూ.18 కోట్ల 92 లక్షలతో నిర్మిస్తున్న RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను, RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం, నాలావిస్తరణ నిర్మాణం పనులను SNDP ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పటేల్ చెరువు అలుగు నుండి గంగారం చెరువు వరకు నూతనంగా చేపట్టబోయే నాలా విస్తరణ పనులను వేగంగా చేయాలని, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. ఎన్నో ఏండ్ల సమస్య తీరనుందని, నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు. నాలాల విస్తరణ పై ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో DE ధీరజ్, నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






