శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోనీ FCI కాలనీ వాసులు, జనప్రియ వెస్ట్ సిటీ కాలనీ వాసులు కాలనీలలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ FCI కాలనీ వాసులు, జనప్రియ వెస్ట్ సిటీ కాలనీ వాసులు, కాలనీలలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై విన్నవించారని, త్వరలోనే కాలనీలలో స్వయంగా పర్యటించి, విడతల వారిగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో FCI కాలనీ వాసులు సుప్రజ, శేషు, బాలమురళి, సుధీర్, ఉపేందర్, నవీన్, జితేందర్, రాశిల్, రేణుక, చిరంజీవి, సుశాంత్, జనప్రియ వెస్ట్ కాలనీ వాసులు చంద్రమోహన్ రెడ్డి, మల్లికార్జున్, ప్రదీప్, రమాకాంత్, రామలింగం, ఇమాన్యుయెల్, శ్రీనివాస్, వెంకట్, జీవన్, ప్రేమ్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.






